Vellampalli Srinivasa Rao: తన సీటు మార్చబోతున్నారనే వార్తలపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందన

Vellampalli Srinivas on news of his seat change
  • తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వెల్లంపల్లి
  • తాను జగన్ సైనికుడినని వ్యాఖ్య
  • జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న మాజీ మంత్రి
వచ్చే ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ టికెట్లను ఇవ్వడం లేదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే పలువురు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను జగన్ మార్చారు. పలువురు ఎమ్మెల్యేలను జగన్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీటును కూడా జగన్ మార్చబోతున్నారని చెపుతున్నారు.

 ఈ నేపథ్యంలో, వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తన గురించి లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జగన్ సైనికుడినని... వైసీపీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సీటు మార్పులో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వెల్లంపల్లి వచ్చారు. తన నియోజకవర్గ నిధుల కోసం సీఎంఓ అధికారులను కలిశానని చెప్పారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP

More Telugu News