Ram Charan: కుటుంబంతో కలిసి ముంబయిలో మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్

Ram Charan and Upasana visits Mumbai Mahalaskhmi Temple along with their daughter Klin Kaara
  • క్లీంకార జన్మించి ఆర్నెల్లు
  • మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ముంబయి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన
  • కుమార్తెతో కలిసి అమ్మవారి దర్శనం

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సందడి చేశారు. కుటుంబంతో కలిసి ఇక్కడి సుప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారలతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. చాలా సింపుల్ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. 

క్లీంకార పుట్టి ఆర్నెల్లయిన సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తెకు అమ్మవారి ఆశీస్సుల కోసం ముంబయి మహాలక్ష్మి ఆలయానికి తీసుకు వచ్చారు. రామ్ చరణ్ రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. 

అటు, మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ, రామ్ చరణ్ వారికి సున్నితంగా నో చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ్నించి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News