Donald Trump: ట్రంప్ కు భారీ షాకిచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు

Colorado Court Disqualifies Trump From 2024 Presidential Primary Ballot
  • కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించిన కోర్టు
  • దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడన్న కోర్టు
  • ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చింది. కొలరాడో కోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చ్ 5న జరగనున్న కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా... నవంబర్ 5న జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతోంది.
Donald Trump
USA
Colarado Court
Presidential Elections

More Telugu News