Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి

Revanth Reddy going to Assembly directly from airport
  • ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
  • మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది.
Revanth Reddy
Congress
Assembly

More Telugu News