Team India: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే... నిదానంగా ఆడుతున్న టీమిండియా

Team India bats slowly in 2nd ODI
  • కెబెరాలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
  • 17 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసిన టీమిండియా
  • మరోసారి రాణించిన సాయి సుదర్శన్
దక్షిణాఫ్రికాతో కెబెరాలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా... 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఫామ్ లో లేని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులకే వెనుదిరగ్గా, యువ ఆటగాడు తిలక్ వర్మ 10 పరుగులే చేసి నిరాశపరిచాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 17 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు. క్రీజులో ఓపెనర్ సాయి సుదర్శన్ (45 బ్యాటింగ్), కెప్టెన్  కేఎల్ రాహుల్ (3 బ్యాటింగ్) ఉన్నారు. 

తొలి వన్డేలో అర్ధసెంచరీతో అలరించిన యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇవాళ్టి మ్యాచ్ లోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తుండడం విశేషం. అతడి స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
Team India
South Africa
Batting
Gqeberha
2nd ODI

More Telugu News