news year: న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు

Restrictions in Hyderabad for new year celebrations
  • అర్ధరాత్రి ఒకటి లోపు వేడుకలు ముగించాలన్న పోలీసులు
  • అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని సూచన
  • సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వవద్దన్న పోలీసులు

2024 న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట లోపు కొత్త సంవత్సర వేడుకలు ముగించాలని పోలీసులు సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందుగానే వేడుకలకు అనుమతులు తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు న్యూఇయర్ మార్గదర్శకాలను జారీ చేశారు.

ప్రతి ఈవెంట్‌‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ ఆర్గనైజర్లకు సూచించారు. పార్కింగ్‌కు ఇబ్బందులు ఉండకుండా చూసుకునే బాధ్యత వారిదే అన్నారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్త పడాలన్నారు. మద్యం ఉండేచోట్ల మైనర్లకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేడుకలకు అనుమతించిన సమయం ముగిశాక లిక్కర్ సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు.

  • Loading...

More Telugu News