నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రోజా ఫైర్
- ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్
- రోజాకు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం
- కొందరు శునకానందం పొందుతున్నారంటూ రోజా మండిపాటు
ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ... తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క చోట పోటీ చేస్తే గెలుస్తామో? లేదో? అనే భయంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని... రెండేసి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు.