Operation Valentine: వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' నుంచి రోమాంఛక టీజర్ విడుదల

Teaser from Varun Tej starring Operation Valentine movie out now
  • వరుణ్ తేజ్ హీరోగా 'ఆపరేషన్ వాలెంటైన్'
  • మానుషి చిల్లర్ కథానాయిక
  • శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో చిత్రం
  • హిందీ, తెలుగు భాషల్లో వస్తున్న భారీ చిత్రం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. నాడు పాకిస్థాన్ బోర్డర్ దాటి సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన భారత వాయుసేన త్రివర్ణ పతాకం పౌరుషాన్ని చూపించింది. ఈ కథాంశంతోనే 'ఆపరేషన్ వాలెంటైన్' తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. 

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రోమాంఛక టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ నిండా సర్జికల్ స్ట్రయిక్స్ దృశ్యాలే  ఉన్నాయి. 

వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ గా కనిపించనున్నాడు. "శత్రువులకు ఓ విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది... మన దేశం గాంధీజీతో పాటు... సుభాష్ చంద్రబోస్ ది కూడా" అంటూ సాగే పదునైన డైలాగులు టీజర్ లో వినొచ్చు. 

'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రానికి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర నిర్మాణంలో సోనీ పిక్చర్స్ వంటి అంతర్జాతీయ సంస్థ పాలుపంచుకుంటుండడం విశేషం.

  • Loading...

More Telugu News