Hyderabad: హైదరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత... నెల్లూరువాసుల అరెస్ట్

Drugs seized in Hyderabad
  • ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్న టీఎస్ న్యాబ్ అధికారులు
  • అపార్టుమెంట్‌లో పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గోవా నుంచి తెప్పించిన డ్రగ్స్
  • పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎస్ న్యాబ్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఓ అపార్టుమెంట్‌లో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇవి దొరికాయి. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వీరు పార్టీ చేసుకుంటుండగా సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు, టీఎస్ న్యాబ్ అధికారులు సంయుక్తంగా ఈ అపార్టుమెంట్‌పై దాడి చేశారు. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరవై డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారని సమాచారం. వీరిని నెల్లూరు వాసులుగా గుర్తించారు.
Hyderabad
drugs
Telangana
Nellore District
Crime News

More Telugu News