సోనియాగాంధీని తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయించాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం!

PAC Unanimous resolution about Sonia Gandhi
  • గాంధీ భవన్‌లో సమావేశమైన తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ
  • మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం
  • రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పాల్గొన్న పలువురు నేతలు
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది.
Go Back to Shorts
Sonia Gandhi
Telangana
Congress
Lok Sabha
Parliament

More Telugu News