IPL-2024: ఈసారి ఐపీఎల్ వేలంలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు వీళ్లే!

AP and Telangana cricketers up to sale in IPL auction
  • ఐపీఎల్-2024 సీజన్ కోసం సన్నాహాలు షురూ
  • రేపు దుబాయ్ లో ఆటగాళ్ల వేలం
  • ఈసారి వేలంలో 13 మంది తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గుర్తింపు తెచ్చుకుంది. ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికం మొదలు, ఫ్రాంచైజీల ఆదాయం, బ్రాండ్ నేమ్, ప్రసార హక్కుల విలువ, అభిమానుల ఆదరణ... ఇలా ఏ అంశం చూసినా ఐపీఎల్ కు సాటిగా నిలిచే క్రికెట్ లీగ్ మరొకటి లేదు. 

కాగా, ఐపీఎల్-2024 సీజన్ కోసం ఇప్పటినుంచే సన్నాహాలు మొదలయ్యాయి. రేపు దుబాయ్ లో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 13 మంది తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కూడా ఉన్నారు. 

వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, రికీ భుయ్, పృథ్వీరాజ్ ఎర్రా ఆంధ్రా క్రికెట్ సంఘానికి చెందినవారు కాగా... రవితేజ, మనీశ్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆరవెల్లి అవనీశ్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్ది, అనికేత్ రెడ్డి, రోహిత్ రాయుడు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందినవారు. వీరిని ఏ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్ టీమిండియా టెస్టు ప్లేయర్లు.

  • Loading...

More Telugu News