Ponnam Prabhakar: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం... శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్

Ponnam Prabhakar took charge as the Minister of Transport and BC Welfare Department
  • వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ
  • మూడు ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • అభినందనలు తెలిపిన అధికారులు, సహచర మంత్రులు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గాను బస్ పాస్ రాయితీల ఖర్చు రీయిమెంబర్స్‌మెంట్ కోసం రూ.212.50 కోట్లను విడుదల చేస్తూ మొదటి ఫైలుపై సంతకం చేశారు. ఇదే త్రైమాసికానికి గాను మరో రూ.162.50 కోట్లను విడుదల చేస్తూ మరో ఫైలుపైనా, ఎల్.రాజ్యలక్ష్మి, హెడ్ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌కి ఒక లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్ మంజూరు చేస్తూ మూడో ఫైలుపైనా సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నంకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Ponnam Prabhakar
Congress
Telangana

More Telugu News