Kajol: ఐసీయూలో బాలీవుడ్ నటి కాజోల్ తల్లి!

Kajol mother admitted in hospital
  • వయసు సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న తనూజ
  • ఆమె వయసు 80 ఏళ్లు
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు

బాలీవుడ్ నటి కాజోల్ తల్లి, పాత తరం హీరోయిన్ తనూజ ముంబై జుహూలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు. 80 ఏళ్ల తనూజ వృద్ధాప్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. తనూజ హిందీ సినిమాలతో పాటు పలు బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. తనూజ తల్లి శోభన సమ్రాట్ కూడా సినీ నటి కావడం గమనార్హం. తనూజ తండ్రి కుమార్ సేన్ సమ్రాట్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు.

  • Loading...

More Telugu News