Bigg Boss-7: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే: మొదట ఎలిమినేట్ అయింది ఇతడే!

Ambati Arjun eliminated from Bigg Boss grand finale
  • నేడు బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే
  • హౌస్ లో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లు
  • వారిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను సుమకు అప్పగించిన నాగ్
  • అంబటి అర్జున్ ను ఎలిమినేట్ చేసి స్టేజి పైకి తీసుకువచ్చిన సుమ
బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉత్సాహభరితంగా సాగుతోంది. మూడు నెలల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్ చేరారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ ఫైనలిస్టులుగా మిగిలారు. 

కాగా, ఆ ఆరుగురిలోంచి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు హోస్ట్ నాగార్జున ప్రముఖ యాంకర్ సుమను హౌస్ లోకి పంపారు. దాంతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సుమ... ఓ రోబో సాయంతో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయినట్టుగా రోబో తేల్చడంతో, అర్జున్ ను సుమ స్టేజిపైకి తీసుకువచ్చారు. 

వాస్తవానికి యాంకర్ సుమ తన కుమారుడు రోషన్ కొత్త చిత్రం 'బబుల్ గమ్' ప్రమోషన్ కోసం బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. ఆమె తనతో పాటు తన కుమారుడు రోషన్, హీరోయిన్ మానస చౌదరిని కూడా వేదికపైకి తీసుకువచ్చారు. నాగార్జున... బబుల్ గమ్ హీరోహీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Bigg Boss-7
Grand Finale
Ambati Arjun
Eliminate
Anchor Suma

More Telugu News