Chandrababu: హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu goes to Pawan Kalyan residence in Hyderabad
  • ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు
  • ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తులు
  • ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్
  • తొలిసారిగా పవన్ నివాసానికి వచ్చిన చంద్రబాబు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే, తొలిసారిగా చంద్రబాబు హైదరాబాదులోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బహుశా, పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం జరిగినా... ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో పవన్ కల్యాణ్ రావడంలేదని ప్రకటన వెలువడింది. ఈ అంశం కూడా చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Chandrababu
Pawan Kalyan
Hyderabad
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News