భారత బౌలర్ల వికెట్ల వేట... 58 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- సఫారీలను హడలెత్తించిన అర్షదీప్, అవేష్ ఖాన్
అయితే టీమిండియా లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ 4, అవేష్ ఖాన్ 3 వికెట్లతో సఫారీలను చావుదెబ్బ కొట్టారు. ఓపెనర్ టోనీ డి జోర్జి 28, కెప్టెన్ మార్ క్రమ్ 12 పరుగులు చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 13 ఓవర్లలో 7 వికెట్లకు 58 పరుగులు. క్రీజులో ఫెహ్లుక్వాయో (3 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (0 బ్యాటింగ్) ఉన్నారు.