జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు
- డిప్లొమా పూర్తి చేసినవారికి 23 మార్కులు, ఫైనల్ సెమిస్టర్లో ఫెయిలైన విద్యార్థులకు 30 మార్కులు కలపనున్న యూనివర్సిటీ
- విద్యార్థులు కోరడంతో డీన్లతో మాట్లాడి నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ
- ప్రయోజనం పొందనున్న 4 వేల మంది విద్యార్థులు
కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు విజ్ఞప్తి చేయడంతో మార్కులు కలిపినట్టు అధికారులు వివరించారు. ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని, తక్షణమే నిర్ణయం ఆచరణలోకి వస్తుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. కాగా గ్రేస్ మార్కులు పెంచుతూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.