కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణ ఘటన
- క్యాబిన్లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు
- బస్సులోని ప్రయాణికులు అనుమానంతో డోర్ తెరవడంతో బయటపడ్డ దారుణం
- డ్రైవర్లను చితక బాదిన ప్రయాణికులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్‌చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు.
కాగా నిందిత బస్సు డ్రైవర్లలో మహ్మద్ ఆరిఫ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడిని లలిత్‌గా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటన 2012లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగగా చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందిన విషయం తెలిసిందే.