Hyderabad: ఆహారం కల్తీ‌లో తొలి స్థానంలో నిలిచిన హైదరాబాద్

Highest number of food adulteration cases recorded in hyderabad
  • నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
  • 2022లో దేశవ్యాప్తంగా 291 కల్తీ ఆహారం కేసుల నమోదు
  • హైదరాబాద్‌లో 246 కల్తీ ఆహారం కేసులు
ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్‌లోనే 246 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ వాటా 84 శాతంగా ఉందని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ కేసుల్లో నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Hyderabad
Telangana
National Crime Records bureau

More Telugu News