padma devender reddy: పార్టీ కార్యకర్త చనిపోతే బీమా అందిస్తోన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే: పద్మా దేవేందర్ రెడ్డి

Padma Devender Reddy gives RS 2 lakh to party follower family
  • చిన్న శంకరంపేటకు చెందిన పార్టీ కార్యకర్త నర్సింహులు మృతి
  • శుక్రవారం వారి ఇంటికి వెళ్లి బీమా డబ్బులు రూ.2 లక్షలు అందించిన పద్మా దేవేందర్ రెడ్డి
  • చనిపోయిన ప్రతి కార్యకర్తకు పార్టీ బీమా ద్వారా భరోసాను ఇస్తోందని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేటకు చెందిన నర్సింహులు ఇటీవల ప్రమాదవశాత్తూ మృతి చెందారు. మృతుడి కుటుంబానికి అతని పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఇన్సురెన్స్ చెక్కును అందించారు. ఈ చెక్కును భార్య శోభకు పద్మా దేవేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సింహులు మృతి బాధాకరమని, చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సురెన్స్ భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే బీమా అందిస్తోన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.
padma devender reddy
BRS

More Telugu News