YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ సునీత

TS High Court adjourns Shiva Shankar Reddy bail plea in YS Viveka murder case
  • శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • సునీత ఇంప్లీడ్ కావడంపై అభ్యంతరం లేదన్న సీబీఐ
  • తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.
YS Vivekananda Reddy
YS Sunitha
Murder Case
Shiva Shankar Reddy
CBI
TS High Court

More Telugu News