Bunny Vas: జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బన్నీ వాస్ ను నియమించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan appointed Tollywood producer Bunny Vas as Janasena party campaign committee chairman
  • జనసేన పార్టీలో కీలక నియామకం
  • నిర్మాత బన్నీ వాస్ కు పార్టీ ప్రచార బాధ్యతలు
  • స్వయంగా నియామక పత్రం అందించిన పవన్ కల్యాణ్
  • జనసేన ప్రచార విభాగాన్ని సమన్వయంతో నడిపించాలని సూచన
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బన్నీ వాస్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియామక పత్రం అందించారు. బన్నీ వాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రచార విభాగం పార్టీకి ఎంతో కీలకం అని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని బన్నీ వాస్ కు సూచించారు. 

పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు. పార్టీ ఎదుగుదల కోసం మరింతగా కష్టపడాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

నిర్మాత బన్నీ వాస్ కు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నయన్న విషయం తెలిసిందే. బన్నీ వాస్ ను తొలి నుంచి మెగా కాంపౌండ్ వ్యక్తిగానే భావిస్తారు.
Bunny Vas
Pawan Kalyan
Janasena
Campaign Committee Chairman

More Telugu News