భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ
- కేసు నమోదు నిజమేనని మీడియాకు వెల్లడి
- ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కాదని క్లారిటీ
- న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య
తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి ఈ దందా చేశారని కేశవాపురం గ్రామస్థులు చెప్పారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మంది, తహసీల్దార్ పై కేసు నమోదు చేశారని వివరించారు. మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి అనుచరులపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు.