టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ కు షాక్.. రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై
- టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టు నిన్న వార్తలు
- రాజీనామాను ఆమోదించలేదని ప్రకటించిన రాజ్ భవన్
- పేపర్ లీకేజ్ అంశం తేలకుండా రాజీనామాను ఆమోదించలేనని గవర్నర్ చెప్పినట్టు సమాచారం
మరోవైపు, టీఎస్ పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కూడా సమీక్ష నిర్వహించనున్నారు. పేపర్ లీకేజీ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను అధికారులతో సమీక్షించనున్నారు. టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీక్ అంశం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.