Mayawati: ఇతడే నా రాజకీయ వారసుడు: మాయావతి కీలక ప్రకటన

Mayavati announces political heir after her
  • కీలక ప్రకటన చేసిన బీఎస్పీ అధినేత్రి
  • తన తర్వాత పగ్గాలు అందుకునేది తన మేనల్లుడేనని వెల్లడి
  • ఇప్పటికే సోదరుడికి పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన మాయావతి 

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడ్ని ప్రకటించారు. తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు ఆకాశ్ ఆనంద్  కొనసాగిస్తాడని వెల్లడించారు. లక్నోలో ఇవాళ జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి ఈ ప్రకటన చేశారు. 

ఆకాశ్ ఆనంద్ వయసు 28 ఏళ్లు. 2017 యూపీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ప్రచారం సాగిస్తున్న వేల ఆకాశ్ ఆనంద్ కూడా ఆమె వెన్నంటే ఉన్నారు.

వారసత్వ రాజకీయాలను నిశితంగా విమర్శించే మాయావతి... 2019లో తన సోదరుడు ఆనంద్ కుమార్ ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం, ఇప్పుడు మేనల్లుడికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News