Govt Advisers: తెలంగాణలో ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు

7 Telangana advisers removed from services
  • కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ ప్రభుత్వం
  • సోమేశ్ కుమార్, ఏకే ఖాన్, రాజీవ్ శర్మ తదితరుల తొలగింపు
  • ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్ ను నియమించే అవకాశం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జీఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయి.
Govt Advisers
Telangana
Termination

More Telugu News