తుపాను బాధిత కస్టమర్ల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ కీలక నిర్ణయం
- ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై మిగ్జామ్ తుపాను ప్రభావం
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కస్టమర్లకు రాయల్ ఎన్ ఫీల్డ్ వెసులుబాటు
- ఉచితంగా టోయింగ్, ఫుల్ వెహికిల్ చెకప్
ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో తుపాను అత్యధిక ప్రభావం చూపిన నేపథ్యంలో... ఈ రెండు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లలో తుపాను ప్రభావానికి గురైన వారికి కొన్ని బైక్ సర్వీసింగ్ సేవలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఈ రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన కస్టమర్లు తమ వివరాలను డిసెంబరు 20 లోపు నమోదు చేసుకోవాలని రాయల్ ఎన్ ఫీల్డ్ సూచించింది. అందుకోసం 1800 2100 007 టోల్ ఫ్రీ నెంబరును కూడా తీసుకువచ్చింది. ఈ నెంబరు డిసెంబరు 8 నుంచి అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివరాలు నమోదు చేసుకున్న వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలలో ఉచితంగా టోయింగ్, ఫుల్ వెహికిల్ చెకప్ నిర్వహిస్తారు.