KCR: కేసీఆర్ కు రెండు చోట్ల విరిగిన తుంటి ఎముక.. స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం

Two fractures to KCR leg bone
  • ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డ కేసీఆర్ 
  • హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలింపు
  • కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన పట్టుతప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టొచ్చని చెపుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉన్నారు.

  • Loading...

More Telugu News