Revanth Reddy: మేమూ అదే కోరుకుంటున్నాం.. ఏపీ సీఎం జగన్ ట్వీట్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రిప్లై

Telangana CM Revanth Reddy Responds To AP CM Jagan Tweet
  • నిన్న తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
  • శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్
  • ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం కోరుకుంటున్నట్టు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయా రాష్ట్రాలతో అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

దీనికి స్పందించిన రేవంత్‌రెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం, సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నిన్న రేవంత్‌రెడ్డి సహా 12 మందితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.
Revanth Reddy
YS Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News