ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ హామీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ హామీ

PM modi congratulates new cm Revanth Reddy
  • రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌కు శుభాకాంక్షలు
  • రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని హామీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 'తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు తరలి వచ్చారు.
Advertisement
Revanth Reddy
Telangana Assembly Election
Narendra Modi

More Telugu News