Garba Dance: గుజరాత్ సంప్రదాయ నృత్యం గార్బాకు యునెస్కో గుర్తింపు

Gujarat traditional dace Garba now in UNESCO list
  • వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
  • నవరాత్రి రోజుల్లో కనువిందు చేసే పురాతన నృత్యం
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమన్న సీఎం
  • మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు స్ఫూర్తినిస్తుందన్న ప్రధాని 

గుజరాత్ సంప్రదాయ నృత్యం గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. నవరాత్రుల రోజుల్లో గుజరాత్‌లోని ప్రతీ వీధిలోనూ గార్భా నృత్యం కనువిందు చేస్తుంది. అంతేకాదు, నవరాత్రుల రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఈ నృత్యం కనిపిస్తుంది. ఇప్పుడీ నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. 

గర్బా రూపంలో మాతృమూర్తికి అంకితం చేసే పురాతన సంప్రదాయం సజీవంగా ఉంటూ, మరింత ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌కు గుర్తింపుగా మారిన గార్బాను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితా కింద ఆమోదించిందని పటేల్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యం ఇవ్వడం, అలాంటి వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడుతూ గుజరాత్ ప్రజలకు అభినందనలు తెలిపారు. 

గార్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందించారు. ఈ గౌరవం మన వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు తమకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ గుర్తింపునకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News