Revanth Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy reaches Shamshabad airport to welcome sonia rahul priyanka gandhi
  • ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
  • ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
  • కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రేవంత్ తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతలకు రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానం పలకనున్నారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న ఎల్బీ స్టేడియంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం 3 గంటలకు రేవంత్ సెక్రటేరియట్ కు వెళ్తారు.

  • Loading...

More Telugu News