Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?

Few ministers likely to take oath along with Revanth Reddy
  • రేపు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
  • ఉప ముఖ్యమంత్రులుగా మల్లు భట్టి, సీతక్కలకు అవకాశం
  • ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు దాదాపు తొమ్మిది మంది మంత్రులుగా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 18 మంది మంత్రులుగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం కేబినెట్‌తో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేం. రేవంత్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు. రేవంత్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వీరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, జీ వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్ రెడ్డి రంగారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, షబ్బీర్ అలీ, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్, వీర్లబల్లి శంకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి చోటు దక్కవచ్చునని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News