రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఆరుగురు ఎమ్మెల్యేలు... రూ.606 కోట్లతో టాప్‌లో వివేక్
- రూ.458 కోట్లతో రెండో స్థానంలో రాజగోపాల్ రెడ్డి.. రూ.434 కోట్లతో మూడోస్థానంలో పొంగులేటి
- రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న వారిలో వినోద్, పొంగులేటి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి
- 50 మందికి పైగా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూ.95.93 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.97 కోట్లు, అరికెపూడి గాంధీ రూ.85 కోట్ల ఆస్తులను ప్రకటించారు. బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.85 కోట్లుగా ప్రకటించారు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రకటించగా, పదహారుమంది ఎమ్మెల్యేలు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ప్రకటించారు.