Aadu Macha: "ఆడు మచ్చా... ఆడు"... రవితేజ 'ఈగిల్' నుంచి మాస్ సాంగ్ విడుదల

Aadu Macha song from Raviteja starring Eagle out now
  • రవితేజ, కావ్యాథాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం 'ఈగిల్'
  • కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం
  • వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో వస్తున్న 'ఈగిల్' 

మాస్ మహారాజా రవితేజ, కావ్యా థాపర్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఆడు మచ్చా అనే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈగిల్ నుంచి రిలీజైన తొలి సాంగ్ ఇదే. 

"తూరుపు తునక ఎరుపు బారెనే... ఎలుగు దునికి దుంకులాడెనే... ఎనుము ఎనక ఎనుము కదిలెనే... ఆడు మచ్చా... ఆడు మచ్చా... ఆడు" అంటూ హుషారుగా సాగే ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాశారు. దావ్ జాంద్ సంగీతం అందించారు. రవితేజ ఎనర్జీకి దీటుగా ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. 

టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న 'ఈగిల్' చిత్రం 2024 జనవరి 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

  • Loading...

More Telugu News