katipalli: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సూచన

BJP Katipalli ultimatum to Congress new government
  • ఏడాదికి ఒకసారి రేషన్, పెన్షన్లను అప్ డేట్ చేయాలని వ్యాఖ్య
  • కామారెడ్డిలో అవినీతిరహిత పాలన అందిస్తామని హామీ
  • తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని స్పష్టీకరణ
ఏడాదికి ఒకసారి రేషన్, పెన్షన్లను అప్ డేట్ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నూతన ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో అవినీతిరహిత పాలన అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తానన్నారు. తనకు విజయాన్ని అందించిన బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
katipalli
Telangana Assembly Results
Congress
BJP

More Telugu News