కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ను కలిసిన నాని
- బెంగళూరులోని శివ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లిన నాని
- ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన నేచురల్ స్టార్
- ఈ నెల 7న విడుదలవుతున్న నాని చిత్రం 'హాయ్ నాన్న'
ప్రస్తుతం నాని తన తాజా చిత్రం 'హాయ్ నాన్న' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 7వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే శివ రాజ్ కుమార్ ను ఆయన కలిశారు. ఈ చిత్రంలో శృతి హాసన్, ప్రియదర్శి, జయరామ్, బేబీ కియారా ఖన్నా తదితరులు నటించారు. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.