Crime News: మెదక్‌లో 25 ఏళ్ల యువతి దారుణ హత్య.. ఆపై పెట్రోలు పోసి కాల్చేసిన దుండగులు

Woman killed and sets fire in Medak
  • రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో మృతదేహం
  • స్థానికుల సమాచారంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ఎక్కడో హత్య చేసి, ఇక్కడకు తీసుకొచ్చి కాల్చి ఉంటారని అనుమానం
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో దారుణం జరిగింది. ఓ యువతిని హత్య చేసిన నిందితులు ఆపై ఆమెను కాల్చివేశారు. హైదరాబాద్‌ రహదారి పక్కన సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వయసు 25 ఉంటుందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తెచ్చి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి ఒంటిపై కాషాయరంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని, ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమను సంప్రదించాలని చేగుంట పోలీసులు తెలిపారు.
Crime News
Medak District
Chegunta

More Telugu News