Vijayasai Reddy: యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకు వేయాలట: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
షార్ట్స్‌లో చూడండి
యువ ఓటర్ల కోసం కూకట్ పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్ లో సీబీఎన్ ఫోరం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారి గుణమే స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడటం అని ఆయన అన్నారు. యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకే వేయాలట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సామాజికవర్గం వారు కూకట్ పల్లిలో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారని... దీని ఉద్దేశం కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట అంటూ దుయ్యబట్టారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News