Team India: అయ్యర్ అర్ధసెంచరీ... ఆసీస్ ముందు ఈజీ టార్గెట్

Team India set easy target for Aussies
  • టీమిండియా, ఆసీస్ మధ్య చివరి టీ20
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీతో అలరించగా, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అక్షర్ పటేల్ రాణించారు. అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. 

ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు నమోదు చేయగా... జితేశ్ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 24 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 2, బెన్ డ్వార్షూయిస్ 2, ఆరోన్ హార్డీ 1, నాథన్ ఎల్లిస్ 1, తన్వీర్ సంఘా 1 వికెట్ తీశారు.
Team India
Australia
Bengaluru
5th T20

More Telugu News