తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- చంద్రబాబు, పురందేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ప్రశ్న
- వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకుంటున్న చోట్ల కూడా బీఆర్ఎస్ గెలిచిందని విమర్శలు
- కాంగ్రెస్ గెలుపులో టీడీపీ సహకారం ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడని ప్రస్తావించారు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుందని అన్నారు. మరి చంద్రబాబు, పురందేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, సీపీఐ 1, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి.