Chandrababu: మళ్లీ జనం బాట పడుతున్న చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..!

  • రాజకీయ కార్యకలాపాలు చేపట్టేందుకు చంద్రబాబుకు సుప్రీంకోర్టు అనుమతి
  • ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు
  • ఈలోగా సీఈసీని కలవాలని భావిస్తున్న టీడీపీ అధినేత
Chandrababu to go into people from December 10

తెలంగాణ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.

More Telugu News