Congress: అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. ఢిల్లీ నుంచి వస్తున్న పార్టీ పెద్దలు!

Congress High Command alert amid Telangana elections results
  • రేపే తెలంగాణ ఎన్నికల ఫలితాలు
  • కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందంటున్న ఎగ్జిట్ పోల్స్
  • ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు 
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని... ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను అప్పుడే ముమ్మరం చేసింది. ట్రబుట్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఇప్పటికే హైదరాబాద్ కు పంపించింది. రేపు ఉదయం కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలా హైదరాబాద్ కు రానున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా రేపు సాయంత్రానికి హైదరాబాద్ కు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Congress
Telangana
Election Results

More Telugu News