కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
- యూజీసీకి ఫిర్యాదు చేసిన జూనియర్ విద్యార్థులు
- రికార్డులు రాసిపెట్టాలని వేధిస్తున్నట్లు ఆరోపణ
- భోజనం తీసుకురావాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదు
జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాంగింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ రికార్డులు రాసి పెట్టాలని, తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలగజేసుకోవాలని, తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు. ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసీ.. ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. కాలేజీలో, విద్యార్థుల హాస్టల్స్ లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.