Adilabad District: పోలింగ్ కేంద్రంలేక ఓటుకు దూరం.. మరో అవకాశం కోసం గ్రామస్తుల విజ్ఞప్తి

Adilabad kundi villagers seek another chance for casting their vote
  • ఆదిలాబాద్ జిల్లా కుండి గ్రామంలో ఘటన
  • గ్రామంలో లేని ఓటింగ్ కేంద్రం
  • రవాణా సదుపాయం కూడా లేక మరో కేంద్రంలో ఓటువేయని గ్రామస్థులు
  • మరో అవకాశం ఇప్పించాలంటూ కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పణ
పోలింగ్ కేంద్రం లేక ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన తమకు మరో అవకాశం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో మరో కేంద్రానికి కూడా వెళ్లలేకపోయామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గ్రామస్థులు కలక్టరెట్‌కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. పాలనాధికారి అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఇన్‌వర్డ్ విభాగంలో వినతి పత్రాన్ని అందజేశారు.
Adilabad District
Kundi Village
Telangana Assembly Election

More Telugu News