Ravichandran Ashwin: డ్రెస్సింగ్ రూంలో ఆ రోజు రోహిత్, విరాట్ ఏడ్చారు: రవిచంద్రన్ అశ్విన్

Rohit virat broke into tears after world cup final defeat says Ashwin Ravichandran
  • వర్డల్ కప్ ఓటమితో డ్రెస్సింగ్ రూంలో టీమిండియా విచారంలో పడిందన్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 
  • అనుభవం ఉన్న టీమిండియాకు తదుపరి ఏం చేయాలో తెలుసని వ్యాఖ్య
  • రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అంటూ కితాబు

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవిచూశాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకున్నారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. టీంలో ప్రతిఒక్కరూ విచారంలో కూరుకుపోయారని వెల్లడించారు. అయితే, టీమిండియాకు అనుభవం ఉందని, భవిష్యత్తులో ఏం చేయాలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. 

రోహిత్ కెప్టెన్సీపై కూడా రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. జట్టులో ప్రతి ఒక్కరి గురించి అతడికి అవగాహన ఉందన్నాడు. ‘‘అందరూ ధోనీని ఉత్తమ కెప్టెన్‌గా పేర్కొంటారు. అయితే, రోహిత్ శర్మ కూడా మామూలోడు కాదు. అందరి ఇష్టాయిష్టాలు అతనికి తెలుసు. ప్రతి ఒక్కరితో సమన్వయం కూడా ఉంది. అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News