Virat Kohli: సౌతాఫ్రికాతో టీ20లు, వన్డేలకు కోహ్లీ దూరం.. రోహిత్ విషయంలో ఇంకా రాని క్లారిటీ!

Virat Kohli to stay away from T20 ODIs with South Africa and no clarity about Rohit Sharma
  • డిసెంబర్ 10 నుంచి ఇండియా - సౌతాఫ్రికా సిరీస్
  • ప్రస్తుతం యూకేలో హాలిడే ట్రిప్ లో ఉన్న కోహ్లీ, రోహిత్
  • టీ20, వన్డేలకు దూరమయ్యే అవకాశం

వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తర్వాత టీమిండియా సరికొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాతో ఇండియా తలపడబోతోంది. అయితే, ప్రొటీస్ తో జరిగే ఈ సిరీస్ లో టీ20లు, వన్డేలకు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దూరమవుతున్నాడని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ కు మాత్రమే కోహ్లీ అందుబాటులోకి వస్తారని ఎన్డీటీవీ ఓ కథనంలో తెలిపింది. టీ20లకు కోహ్లీ దూరం కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, వన్డేలకు దూరం కావడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడతాడా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, టెస్ట్ సిరీస్ లో రోహిత్ ఆడతాడని భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ యూకేలో హాలిడే ట్రిప్ లో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News