Jabardasth: జబర్దస్త్‌కు నయా జడ్జ్.. ఖుష్బూ స్థానంలో ‘గులాబీ’ హీరోయిన్

Jabardasth comedy show judge Khushboo place changed with Maheswari
  • జబర్దస్త్ షో జడ్జ్‌గా ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి
  • ఇటీవలి కాలంలో షోలో పలుమార్పులు
  • యాంకర్ సౌమ్యారావు స్థానంలో బిగ్‌బాస్ బ్యూటీ సిరి హేమంత్
ఇటీవల రేటింగ్ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ టీవీ కామెడీ షో ‘జబర్దస్’కు పాప్యులారిటీ మాత్రం తగ్గలేదు. ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన నాగబాబు, రోజా మారిన తర్వాత చాలామంది వచ్చారు. ప్రస్తుతం భగవాన్, ఖుష్బూ ఆ స్థానాల్లో ఉన్నారు. అయితే, ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఖుష్బూ స్థానాన్ని ‘గులాబీ’ ఫేం హీరోయిన్ మహేశ్వరితో భర్తీచేశారు. అయితే, ఆమె ఒక్క ఎపిసోడ్‌కే పరిమితం అవుతారా? లేదంటే, పూర్తిగా కొనసాగుతారా? అన్న విషయం తెలియరాలేదు.

జబర్దస్త్ విషయంలో ఇటీవలి కాలంలో మార్పులు చాలానే చోటుచేసుకుంటున్నాయి. నాగబాబు, రోజా వెళ్లిపోయాక షోలో అశ్లీల కామెడీ పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు క్రమంగా ఈ షోకు దూరమవుతున్నారు. అలాగే, యాంకర్ అనసూయ గుడ్‌బై చెప్పడం.. సుధీర్, అవినాశ్ వంటి కమెడియన్లు షో నుంచి వెళ్లిపోవడం కూడా ప్రభావం చూపించింది. అనసూయ స్థానంలో వచ్చిన సౌమ్యారావు కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఆమె ప్లేస్‌లో ఇప్పుడు బిగ్‌బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చి చేరింది.
Jabardasth
Maheswari
Kushboo
Jabardasth Comedy Show

More Telugu News