teacher jobs: నన్నే ప్రశ్నిస్తావా.. నీకు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తా: మహారాష్ట్ర మంత్రి వార్నింగ్

Maharashtra Minister Rebukes Woman After Question Over Job Delay
  • టీచర్ పోస్టుల భర్తీపై మంత్రిని ప్రశ్నించిన యువతి
  • తనను నిలదీయడంపై మండిపడ్డ మంత్రి దీపక్ కేసర్కార్
  • నీ పేరును అధికారులకు పంపించి డిస్ క్వాలిఫై చేయిస్తానని బెదిరింపు
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు చేస్తారని అడిగిన ఓ యువతిని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి బెదిరించాడు.. నీకు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తానంటూ హెచ్చరించాడు. నీ పేరు, వివరాలను అధికారులకు పంపించి నిన్ను డిస్ క్వాలిఫై చేయిస్తానని బహిరంగంగా, మీడియా ముందే వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి కేసర్కార్ హాజరయ్యారు. సభలో ప్రసంగించిన తర్వాత మంత్రి వెళ్లిపోతుండగా స్థానికులు ఆయనకు పలు విజ్ఞఫ్తులు చేస్తున్నారు. వారితో మాట్లాడుతూ మంత్రి ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ యువతి మంత్రి ముందుకు వచ్చి టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారంటూ అడిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి జవాబిచ్చారు.

అయితే, నియామక ప్రాసెస్ ఎంతకాలం సాగదీస్తారని, ఎదురు చూసి చూసి తమకు విసుగుపుడుతోందని ఆ యువతి విమర్శించింది. దీంతో కోపం తెచ్చుకున్న మంత్రి కేసర్కార్.. ఇలా క్రమశిక్షణ లేకుండా మాట్లాడుతున్నావేంటని, నీ పేరు వివరాలు తీసుకుని ఇప్పుడే అధికారులకు పంపిస్తానని, నిన్ను డిస్ క్వాలిఫై చేయాలని ఆదేశిస్తానని బెదిరించారు.
teacher jobs
Maharashtra
woman asks for job
Job Delay
Minister Rebukes
Deepak kesarkar

More Telugu News