ఆసీస్ తో మూడో టీ20... టాస్ ఓడిన టీమిండియా

ఆసీస్ తో మూడో టీ20... టాస్ ఓడిన టీమిండియా

Team India loses toss in 3rd T20
  • నేడు టీమిండియా, ఆస్ట్రేలియా మూడో టీ20
  • గువాహటిలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • ఇప్పటికే సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా
  • నేటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ కైవసం
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కు గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు నెగ్గిన టీమిండియా మాంచి ఊపుమీదుంది.

కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా పేసర్ ముఖేశ్ కుమార్ ఆడడంలేదు. తాను పెళ్లి చేసుకుంటున్నానని, ఈ మ్యాచ్ లో తాను ఆడబోవడంలేదని, జట్టు నుంచి తనను విడుదల చేసేలా అనుమతి ఇవ్వాలని ముఖేశ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ ఆమోదించింది. అతని స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ముఖేశ్ కుమార్ నాలుగో టీ20 నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, టోర్నీలో మిగిలిన మ్యాచ్ ల కోసం టీమిండియాలోకి పేసర్ దీపక్ చహర్ ను ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది. 

కాగా, ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఇవాళ్టి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది.
Advertisement
Team India
Toss
Batting
Australia
3rd T20

More Telugu News